వైసీపీ హయాంలోనే ఆదాయం ఎక్కువ

ABN , First Publish Date - 2022-02-19T08:44:56+05:30 IST

‘‘తెలుగుదేశం ప్రభుత్వ తొలి మూడేళ్ల ఆదాయంతో పోలిస్తే వైసీపీ హయాంలో తొలి మూడేళ్ల ఆదాయం రూ.1,25,995 లక్షల కోట్లు ఎక్కువ. ...

వైసీపీ హయాంలోనే ఆదాయం ఎక్కువ

 1,25,995 లక్షల కోట్లు అధికంగా వచ్చాయి: యనమల

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగుదేశం ప్రభుత్వ తొలి మూడేళ్ల ఆదాయంతో పోలిస్తే వైసీపీ హయాంలో తొలి మూడేళ్ల ఆదాయం రూ.1,25,995 లక్షల కోట్లు ఎక్కువ. మా హయాంలో తొలి మూడేళ్లలో రూ.1,65,507 కోట్లు వస్తే... వైసీపీ మూడేళ్లలో రూ.2,52,369 కోట్లు వచ్చింది. కేంద్ర నిధులు కూడా కలిపితే మా హయాంలో తొలి మూడేళ్లలో రూ.3,18,716 కోట్లు వస్తే... వైసీపీ మూడేళ్లలో రూ.4,44,711 కోట్లు వచ్చింది. అంటే కొవిడ్‌ ప్రభావం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందనేది అర్థమవుతూనే ఉంది. అయినా అభివృద్ధిలో, వివిధ శాఖల పురోగతిలోను మాత్రం అట్టడుగున ఉంది’’ అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఆయన శుక్రవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

Read more