పెరగనున్న ఎండలు తగ్గనున్న చలి ప్రభావం

ABN , First Publish Date - 2022-02-19T08:44:02+05:30 IST

శీతాకాలం చివరి దశకు చేరడంతో చలి ప్రభావం తగ్గి వచ్చే వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది....

పెరగనున్న ఎండలు తగ్గనున్న చలి ప్రభావం

విశాఖపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): శీతాకాలం చివరి దశకు చేరడంతో చలి ప్రభావం తగ్గి వచ్చే వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో పగటిపూట ఎండలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వాతావరణ మార్పులపై ఐఎండీ బులెటిన్‌ విడుదల చేసింది. ఉత్తరాదిలో వర్షాలు తగ్గుతాయని, అదే సమయంలో కనీస ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. కాగా, రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల మంచు కురిసింది. ఉదయం 8గంటల వరకు మంచు ప్రభావం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం కర్నూలులో 33.7 డిగ్రీల గరిష్ఠ, ఆరోగ్యవరంలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2022-02-19T08:44:02+05:30 IST