వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకం

ABN , First Publish Date - 2022-02-16T07:22:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ వక్ఫ్‌బోర్డులో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ...

వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకం

అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ వక్ఫ్‌బోర్డులో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలెక్టెడ్‌ మెంబర్‌గా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, నామినేటెడ్‌ సభ్యులుగా ఖాదర్‌ బాషా, మహమ్మద్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌, షబ్నం ఆఫ్రోజ్‌, షేక్‌ షరీన్‌బేగం, అబ్దుల్‌ బషీరుద్దీన్‌లను నియమించింది. వక్ఫ్‌బోర్డు సభ్యులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అందులోనుంచే ఒకరిని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Read more