యువతను దగా చేసిన జగన్: లోకేశ్
ABN , First Publish Date - 2022-08-13T08:46:59+05:30 IST
యువతను దగా చేసిన జగన్: లోకేశ్
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఏటా ఉద్యోగాల కేలండర్ విడుదల చేస్తామని చెప్పి యువతను దగాచేసిన సీఎం జగన్ ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు భరోసా కల్పించాలన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ట్విటర్లో యువతకు శుభాకాంక్షలు తెలిపారు.