తిరుమలలో యూపీ అధికారుల బృందం

ABN , First Publish Date - 2022-01-28T09:51:25+05:30 IST

తిరుమలలో యూపీ అధికారుల బృందం

తిరుమలలో యూపీ అధికారుల బృందం

తిరుమల, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో తిరుమల తరహా భద్రతను ఏర్పాటు చేయడంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన అధికారుల బృందం గురువారం తిరుమలలో పర్యటించింది. డీఐజీలు సుభాష్‌ చంద్ర దూబే, వినోద్‌ కె.సింగ్‌, మరో నలుగురు ఐపీఎస్‌ అధికారుల బృందం శ్రీవారిని దర్శించుకున్నాక.. భద్రత విధానాన్ని పరిశీలించారు. 

Read more