పొరుగు రాష్ట్రాలు ప్రోత్సహిస్తుంటే.. ఇక్కడ ఇబ్బందులు సృష్టిస్తున్నారు: ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య

ABN , First Publish Date - 2022-01-28T09:27:57+05:30 IST

పొరుగు రాష్ట్రాలు ప్రోత్సహిస్తుంటే.. ఇక్కడ ఇబ్బందులు సృష్టిస్తున్నారు: ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య

పొరుగు రాష్ట్రాలు ప్రోత్సహిస్తుంటే.. ఇక్కడ ఇబ్బందులు సృష్టిస్తున్నారు: ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య

మంగళగిరి, జనవరి 27: కరోనాకు మందు పంపిణీ విషయంలో తమిళనాడుతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాలు తనకు ఆహ్వానం పలికి ప్రోత్సహిస్తుంటే..  మన రాష్ట్రంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం మంగళగిరిలో బీసీ వెల్ఫేర్‌ జేఏసీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు తనను ప్రోత్సహిస్తుంటే మన రాష్ట్ర ప్రభు త్వం మాత్రం ఆయుష్‌శాఖ నుంచి నోటీసులు ఇప్పిస్తూ తనను ఇబ్బందుల పాల్జేస్తోందన్నారు. 

Read more