ఉద్యమంలో పాల్గొంటాం: వీఆర్వోల సంఘం

ABN , First Publish Date - 2022-01-23T08:33:07+05:30 IST

ఉద్యమంలో పాల్గొంటాం: వీఆర్వోల సంఘం

ఉద్యమంలో పాల్గొంటాం: వీఆర్వోల సంఘం

విజయవాడ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణలో గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొంటారని ఏపీ వీఆర్వోల సంఘం ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, ఎం.అప్పలనాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ, కారుణ్య నియామకాలలో వీఆర్వోలతో పాటు ఇప్పుడు ప్రతి శాఖలోని ఉద్యోగికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు గ్రామ సచివాలయాలలో ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఖండించారు. వారి అర్హతలను బట్టి గతంలో మాదిరిగా కారుణ్య నియామకాలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లే పరిస్థితి కల్పించకుండా తక్షణం సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. 

Read more