బీసీ సభలో ఫుడ్ కోసం ఫైట్
ABN , First Publish Date - 2022-12-07T18:05:26+05:30 IST
జయహో బీసీ సభలో సమన్వయ లోపంతో ఫుడ్ కోసం ఫైట్ జరిగింది. ముందుగానే ఫలానా ఐటమ్స్తో ఫుడ్ పెడుతున్నట్టు సోషల్ మీడియాలో వైసీపీ తిప్పింది.
విజయవాడ: జయహో బీసీ సభలో సమన్వయ లోపంతో ఫుడ్ కోసం ఫైట్ జరిగింది. ముందుగానే ఫలానా ఐటమ్స్తో ఫుడ్ పెడుతున్నట్టు సోషల్ మీడియాలో వైసీపీ తిప్పింది. భోజనాలు బిషప్ అజరయ్య స్కూల్లో ఏర్పాటు చేశారనడంతో.. సీఎం మాట్లాడుతుండగానే కార్యకర్తలు అటువైపు వెళ్లారు. అక్కడ గేట్లకు తాళాలు వేసి ఉండడంతో స్టేడియం.. వాటర్ ట్యాంకు సమీపంలోని గేట్ 6 దగ్గరకు లైన్ చేరింది. తమను భోజనాలకు వదలాలని జనాలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ససేమిరా అంటూ పోలీసులు ఒప్పుకోలేదు. కట్టడి చేయడానికి రోప్ వేసి పోలీసులు అడ్డుగా నిలబడ్డారు. జనం వెనక్కి తగ్గకపోవడంతో వారిపై పోలీసులు చేయిచేసుకున్నట్లు బాధితులు వాపోతున్నారు. దీంతో గేట్లు గెంటుకుని మరీ ఫుడ్ కోర్టు వైపు ఆ పార్టీ కార్యకర్తలు పరుగులు తీశారు. అయినా కొందరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో.. వెళ్తూ వెళ్తూ నిర్వహకులకు కార్యకర్తలు శాపనార్ధాలు పెట్టారు.