AP News: తిట్టడమే కాకుండా కాలితో తన్నింది: సీఐ

ABN , First Publish Date - 2022-12-15T17:08:04+05:30 IST

నిన్న రాత్రి 112 నెంబర్కు కాల్ వచ్చిందని సీఐ రామారావు తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో యువతి హల్చల్ చేస్తున్నట్టు తెలిసిందన్నారు.

AP News: తిట్టడమే కాకుండా కాలితో తన్నింది: సీఐ

విశాఖ: విశాఖ బీచ్ రోడ్డులో యువతి హల్చల్ చేస్తున్నట్టు తెలిసిందని సీఐ రామారావు వెల్లడించారు. నిన్న రాత్రి 112 నెంబర్కు కాల్ వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే వైఎంసీఎ పార్కింగ్ ప్లేస్ దగ్గర మద్యం సేవిస్తూ న్యూసెన్స్ చేస్తోందన్నారు. ఈలోపు ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం అక్కడికి చేరుకొని ఆమెను ప్రశ్నించగా నోటికి వచ్చినట్టు తిట్టడమే కాకుండా ఆయన్ని కాలితో తన్నిందన్నారు. అనంతరం యువతికి బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేయగా 149 యూనిట్స్ వచ్చిందన్నారు. ప్రస్తుతం యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని, మహిళను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామన్నారు.

Updated Date - 2022-12-15T20:29:34+05:30 IST