ప్రజా సేవలేని జీవితం వ్యర్థం: వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2022-10-03T23:26:26+05:30 IST

ప్రజా సేవలేని జీవితం వ్యర్థం: వెంకయ్యనాయుడు

ప్రజా సేవలేని జీవితం వ్యర్థం: వెంకయ్యనాయుడు

నెల్లూరు: వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో దసరా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో విద్యా విజ్ఞానం చూస్తుంటే సంతోషంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పిల్లలకు విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలని నేర్పిస్తున్నారని, మహిళలు స్వశక్తితో ఎలా ఎదగాలో స్వర్ణభారత్ ట్రస్ట్ నేర్పిస్తుందననారు. రైతులు, పేదలు, విద్యార్థుల కోసం శ్రమిస్తున్న వెంకయ్యనాయుడికి ఆయన అభినందనలు తెలిపారు. అలాగే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... సంపాదించిన దానిలో కొంత భాగం సమాజానికి ఇవ్వడం జీవితంలో భాగం కావాలన్నారు. ప్రజా సేవలేని జీవితం వ్యర్థమన్నారు.  అవినీతి, అక్రమాలపై పోరాటమే విజయదశమి అన్నారు. మన పెద్దవారు అందించిన సంస్కృతిని మనమంతా కాపాడుకోవాలని ఆయన సూచించారు. 

Read more