నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ABN , First Publish Date - 2022-08-10T15:33:12+05:30 IST
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

శ్రీసత్యసాయి: జిల్లాలోని గుడిబండ మండలం గుడగలో విషాదఘటన చోటుచేసుకుంది. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పశువులను మేతకోసం తీసుకెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.