లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

ABN , First Publish Date - 2022-08-18T13:56:52+05:30 IST

లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

శ్రీసత్యసాయి: జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనుకనుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ’ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Read more