దారుణం... ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2022-08-15T23:44:34+05:30 IST

దారుణం... ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు

దారుణం... ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు

గుంటూరు: జిల్లాలోని తుమ్మలపాలెం దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా విజయవాడకు చెందినవారుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-08-15T23:44:34+05:30 IST