ఏపీలో రైల్వే ప్రాజెక్ట్లపై చేతులెత్తేసిన కేంద్రం

ABN , First Publish Date - 2022-07-27T19:26:07+05:30 IST

ఏపీలో రైల్వే ప్రాజెక్ట్లపై చేతులెత్తేసిన కేంద్రం

ఏపీలో రైల్వే ప్రాజెక్ట్లపై చేతులెత్తేసిన కేంద్రం

ఢిల్లీ: ఏపీలో రైల్వే ప్రాజెక్ట్లపై కేంద్రం చేతులెత్తేసింది.  ఏపీలో రైల్వే ప్రాజెక్ట్లను చేపట్టలేమని రైల్వేశాఖ తేల్చి చెప్పినట్లు సమాచారం.  లోక్సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టులకు ఏపీ నిధులను కేటాయించడం లేదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రూ.1,798 కోట్లు పెండింగ్ నిధులు ఏపీ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేమని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.  

Read more