TS News: విరిగిన తూము రాడ్డు... ఆందోళనలో రైతులు
ABN , First Publish Date - 2022-12-15T21:27:38+05:30 IST
జిల్లాలోని సిద్దాపురం చెరువు పెద్ద తూము రాడ్డు విరిగిపోయింది. ఆ తూము విరగడంతో చెరువు నీళ్లు పొలాల్లోకి పారుతున్నాయి.
నంద్యాల: జిల్లాలోని సిద్దాపురం చెరువు పెద్ద తూము రాడ్డు విరిగిపోయింది. ఆ తూము విరగడంతో చెరువు నీళ్లు పొలాల్లోకి పారుతున్నాయి. దాంతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఆత్మకూరు మండల పరిధిలోని సిద్దాపురం చెరువు పరిసరప్రాంతాల వాసులు, రైతులు భయాందోళనలో గురవుతున్నారు. అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోని, నీట మునిగిన పంటలకు సాయం చేయాలని రైతులు కోరుతున్నారు.