ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం

ABN , First Publish Date - 2022-11-24T16:47:14+05:30 IST

జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (Idupulapaya IIIT College) లో విషాదఘటన చోటుచేసుకుంది.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం

కడప: జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (Idupulapaya IIIT College) లో విషాదఘటన చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థి ఈశ్వర్ ఆత్మహత్యకు (Sucid) పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా ఉరవకొండ వాసిగా గుర్తించారు. ఈ ఆత్మహత్య ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు (Police) మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. విద్యార్థి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, విద్యార్థి ఆత్మహత్యలో ఏవరి పాత్రయైన ఉందా? లేక ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-11-24T16:47:14+05:30 IST

Read more