గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలు

ABN , First Publish Date - 2022-06-28T00:59:47+05:30 IST

జిల్లాలోని గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారు.

గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలు

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారు. దాంతో ఎమ్మెల్సీ బచ్చుల, మాజీ మంత్రి పిన్నమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహానికి ఉన్న వైసీపీ రంగులు చెరిపిన కార్యకర్తలు పసుపు రంగులు వేసారు. అనంతరం పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. మాజీమంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కొడాలి నానివి దిగజారుడు రాజకీయాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. మహానాడు బ్యానర్లపై వైసీపీ నేతల బ్యానర్లు పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటర్‌ దూరంలో ఘటన చోటుచేసుకుంది. 

Updated Date - 2022-06-28T00:59:47+05:30 IST