‘అందుకే చంద్రబాబుపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు’
ABN , First Publish Date - 2022-10-18T00:09:27+05:30 IST
‘అందుకే చంద్రబాబుపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు’
అమరావతి: జలయజ్ఞాన్ని వైఎస్ కుటుంబం ధనయజ్ఞం చేసిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. రైతులను క్రాప్ హాలీడేల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల ఆత్మహత్యల్లో ఏపీది 3వ స్థానం అన్నారు. సుభిక్షంలో ఉన్న రైతాంగాన్ని జగన్‌రెడ్డి దుర్భిక్షంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై సీఎం జగన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.