పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ ఆదేశాలు ఇవే

ABN , First Publish Date - 2022-10-07T22:04:38+05:30 IST

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ ఆదేశాలు ఇవే

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ ఆదేశాలు ఇవే

అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించాలని జగన్ ఆదేశించారు. మార్చి 31లోపు అన్ని రోడ్లనూ మళ్లీ బాగు చేయాలని సూచించారు. చెత్త శుద్ధి ప్రక్రియలో సౌకర్యాలపై నివేదికలు తయారు చేయాలన్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారిలో సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. విశాఖలో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. 

Read more