నాడు ఆయన్ను తప్పించి కోర్టులో చీవాట్లు తిన్నారు.. చంద్రబాబు ట్వీట్

ABN , First Publish Date - 2022-10-07T22:14:58+05:30 IST

నాడు ఆయన్ను తప్పించి కోర్టులో చీవాట్లు తిన్నారు.. చంద్రబాబు ట్వీట్

నాడు ఆయన్ను తప్పించి కోర్టులో చీవాట్లు తిన్నారు.. చంద్రబాబు ట్వీట్

అమరావతి: విజయనగరంలోని మహారాజా ఆస్పత్రి పేరు మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. మహారాజా ఆస్పత్రి పేరు మార్పు మరో తుగ్లక్ చర్య అన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి ప్రభుత్వం విమర్శల పాలైందన్నారు. నాడు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్ పోస్టుల నుంచి అశోక్‌గజపతిని ఇలాగే తప్పించి కోర్టులో చీవాట్లు తిన్నారని చెప్పారు. అయినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గాల్సిందేనన్నారు. 

Read more