జగన్‌పై అచ్చెన్న ఫైర్... అది మీ తాత కట్టింది కాదు

ABN , First Publish Date - 2022-09-22T01:15:06+05:30 IST

జగన్‌పై అచ్చెన్న ఫైర్... అది మీ తాత కట్టింది కాదు

జగన్‌పై అచ్చెన్న ఫైర్... అది మీ తాత కట్టింది కాదు

అమరావతి: ఈ రోజు తెలుగుజాతికి దుర్దినమని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ పేరు మార్చడానికి ఎలా మనసు వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకునేవరకూ పోరాడతామన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ నేతలే ఎన్టీఆర్‌ పేరు మార్పును ఒప్పుకోరని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆరోగ్య వర్సిటీని ఎన్టీఆర్‌ ప్రారంభించారని గుర్తుచేశారు.పేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌ పేరును మార్చడం సరికాదని సూచించారు. 


ఏపీని ఐదుగురు రెడ్లకు జగన్‌రెడ్డి కట్టబెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీలపై పెత్తనం చేయాలని రెడ్లకు జగన్‌ అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. జగన్‌రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చారని, హెల్త్‌ యూనివర్సిటీ జగన్‌రెడ్డి తాత కట్టింది కాదన్నారు. బీసీ సాధికారిత సమితి సూచనలను మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామన్నారు. 

Read more