ఏపీ అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసర భేటీ

ABN , First Publish Date - 2022-11-30T18:42:58+05:30 IST

ఏపీ అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసర భేటీ అయింది. న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ హైకోర్టులో నిరసనలు వ్యక్తం చేశారు.

ఏపీ అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసర భేటీ

అమరావతి: ఏపీ అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసర భేటీ అయింది. న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ హైకోర్టులో నిరసనలు వ్యక్తం చేశారు. అక్రమ బదిలీలను కొలీజియం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భోజన విరామ సమయంలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే న్యాయవాద సంఘాలకు లేఖ రాసి మద్దతు కోరాలని తీర్మానం తీసుకున్నారు. రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్, గవర్నర్, కేంద్ర న్యాయశాఖ మంత్రికి రిప్రజెంటేషన్ లెటర్స్ ను న్యాయవాదుల సంఘం పంపించారు. రాష్ట్రంలోని ప్రతి బార్ అసోసియేషన్ మద్దతును ఏపీజేఏసీ కోరింది.

Updated Date - 2022-11-30T18:42:59+05:30 IST