దారుణం... భార్యను చంపిన భర్త

ABN , First Publish Date - 2022-09-17T21:23:41+05:30 IST

దారుణం... భార్యను చంపిన భర్త

దారుణం... భార్యను చంపిన భర్త

అనంతపురం: జిల్లాలోని తపోవనం సర్కిల్లో దారుణఘటన చోటుచేసుకుంది. భార్య సావిత్రమ్మను ఇనుపరాడ్డుతో భర్త రాజన్న కొట్టి చంపాడు. కుటుంబీకుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాజన్నను ఫోర్త్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.  


Read more