విషాదం.... వినాయక నిమజ్జనంలో అపశృతి

ABN , First Publish Date - 2022-09-01T02:10:54+05:30 IST

విషాదం.... వినాయక నిమజ్జనంలో అపశృతి

విషాదం.... వినాయక నిమజ్జనంలో అపశృతి

అనంతపురం: జిల్లాలోని రాప్తాడు సమీపంలోని పండమేరు వంకలో విషాదఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారు. శ్రీ రాములు(45) మృతి, జయశ్రీ (14) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Read more