రెండో రోజుకు AP ministers బస్సు యాత్ర... గాజువాకలో సభ
ABN , First Publish Date - 2022-05-27T17:15:35+05:30 IST
ఏపీ మంత్రుల బస్సుయాత్ర రెండో రోజుకు చేరుకుంది.

విశాఖపట్నం: ఏపీ మంత్రుల(AP Ministers) బస్సుయాత్ర రెండో రోజుకు చేరుకుంది. నగరంలోని పాతగాజువాక జంక్షన్లో మంత్రుల బహిరంగసభ నిర్వహించారు. ముందుగా దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు(Mutyalanaidu) మాట్లాడుతూ... కెబినెట్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. జగన్ సీఎం కాగానే సంక్షేమం, అభివృద్ధిని 80 శాతం ప్రజలకు చేరువ చేస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని ముత్యాలనాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని, పలువురు మంత్రులు పాల్గొన్నారు.