తాడేపల్లిగూడెంలో AP ministers బస్సు యాత్ర
ABN , First Publish Date - 2022-05-28T16:09:39+05:30 IST
సామాజిక న్యాయభేరి పేరుతో రాష్ట్ర మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర మూడవ రోజుకు చేరుకుంది.

పశ్చిమగోదావరి: సామాజిక న్యాయభేరి పేరుతో రాష్ట్ర మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి చెందిన 17 మంది మంత్రులు హాజరయ్యారు. పోలీస్ ఐలాండ్ సెంటర్‌లో నేతలకు మంత్రులు నివాళులర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని అన్నారు. 25 మంది ఉన్న కేబినెట్‌లో ఏకంగా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు క్యాబినెట్ హోదా కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే అని తెలిపారు. వెనుకబడ్డ కులాలకు వార్డు మెంబర్లుగా ఇవ్వడానికి ఆలోచించే ప్రతిపక్ష పార్టీలు క్విట్ జగన్మోహన్ రెడ్డి అనడం వారి మూర్ఖత్వానికి పరాకాష్ఠ అంటూ మంత్రులు విరుచుకుపడ్డారు. మంత్రుల సభకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.