AP Government లోగోతో తప్పుడు ప్రచారం... పలువురిపై కేసులు

ABN , First Publish Date - 2022-05-31T19:19:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం లోగోను ఉపయోగించి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురిపై మంగళగిరి సీఐడీ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి.

AP Government లోగోతో తప్పుడు ప్రచారం... పలువురిపై కేసులు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం లోగోను ఉపయోగించి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురిపై మంగళగిరి సీఐడీ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. కోగంటి శ్రీనివాస్‌, పర్చూరి రమ్య, దాసరి కోటి సహా 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని 66-C, ఐపిసి లోని 505(2), 464, 465, 466, 469, 471, 474, 500 సెక్షన్లు కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41A కింద వారికి నోటీసులు జారీ చేశారు. కాగా.. కోగంటి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రేపు విచారణకు రావలసిందిగా దర్యాప్తు అధికారి నోటీసుల్లో పేర్కొన్నారు.  

Updated Date - 2022-05-31T19:19:07+05:30 IST