చలో అమలాపురానికి AP congress పిలుపు... అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-05-26T18:23:56+05:30 IST

కోనసీమ అల్లర్లను నిరసిస్తూ చలో అమలాపురం కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

చలో అమలాపురానికి AP congress పిలుపు... అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: కోనసీమ అల్లర్లను నిరసిస్తూ చలో అమలాపురం కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా కాంగ్రెస్ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీపీసీసీ చీఫ్ శైలజనాథ్తో పాటు ఎస్సీ విభాగం చైర్మన్ వినయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ... కోనసీమలోని మతోన్నాదులు అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు. కుట్రలకు ఆస్కారం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. మంత్రి ఇంటిపై దాడి జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అమలాపురం అల్లర్లను వైసీపీ నేతలే ప్రోత్సహించారనేది వాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు శైలజానాథ్ వెల్లడించారు. 

Read more