మంత్రివర్గ కూర్పుపై ఏలూరు వైసీపీలో అసంతృప్తి

ABN , First Publish Date - 2022-04-11T03:15:28+05:30 IST

మంత్రివర్గ కూర్పుపై జిల్లా వైసీపీలో అసంతృప్తి రగిలింది. మంత్రి పదవుల్లో ఏలూరు జిల్లాకు అన్యాయం జరిగిందని...

మంత్రివర్గ కూర్పుపై ఏలూరు వైసీపీలో అసంతృప్తి

ఏలూరు: మంత్రివర్గ కూర్పుపై జిల్లా వైసీపీలో అసంతృప్తి రగిలింది.  మంత్రి పదవుల్లో ఏలూరు జిల్లాకు అన్యాయం జరిగిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఏలూరు జిల్లా నుంచి ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్కక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. గతంలో ఏలూరు నుంచి ఆళ్లనాని  కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఏలూరు నుంచి ఎవరికీ కేబినెట్‌లో బెర్త్ దక్కకపోవడంపై నాని వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 


కాగా  కొత్త మంత్రుల జాబితాకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.  జాబితాలో చివరి నిమిషంలో ఆదిమూలపు సురేష్‌ పేరు వెలుగులోకి వచ్చింది. సురేష్‌కు బదులు తిప్పేస్వామిని తొలగించారు. సోమవారం మంత్రులతో  గవర్నర్‌ హరిచందన్  ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 

Read more