ఇది ఉద్యోగుల ఎనిమీ గవర్నమెంట్: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-01-20T02:48:29+05:30 IST

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రెండ్లీ ఉద్యోగుల గవర్నమెంట్

ఇది ఉద్యోగుల ఎనిమీ గవర్నమెంట్: సోము వీర్రాజు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రెండ్లీ ఉద్యోగుల గవర్నమెంట్ కాదని, ఉద్యోగుల ఎనిమీ గవర్నమెంట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులను పీఆర్సీ పేరిట వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. మధ్యంతర భృతి కంటే ఫిట్‌మెంట్ తగ్గించి ఇవ్వడం ఉద్యోగులను నమ్మించి మోసం చేయడమేనన్నారు


. హెచ్‌ఆర్‌ఎ తగ్గించి ప్రభుత్వ ఉద్యోగులను ఇంతటి అన్యాయం చేసిన ఇంతటి ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఎన్నడూ చూడలేదని ఆయన ఆరోపించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదని, ఎనిమీ ప్రభుత్వమని నిరూపించుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఏరియర్స్ గురించి ప్రభుత్వం పల్లెత్తు మాట ఎత్తడం లేదన్నారు. జీతభత్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తేడా ఉందన్నారు. అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం తగదని ఆయన హితవు పలికారు. 

Updated Date - 2022-01-20T02:48:29+05:30 IST