ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు
ABN , First Publish Date - 2022-03-11T18:41:02+05:30 IST
వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను మంత్రి కన్నబాబు శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు.
అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను మంత్రి కన్నబాబు శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.43052.78 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు...
- మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ.614.23 కోట్లు
- సహకార శాఖకు రూ.248.45 కోట్లు
- ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు
- ఉద్యనశాఖకు రూ.554 కోట్లు
- పట్టు పరిశ్రమకు రూ.98.99 కోట్లు
- ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు
- వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు
- వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.122.50 కోట్లు
- పశు సంవర్ధక శాఖకు రూ.1027.82 కోట్లు
- మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ.337.23 కోట్లు
- వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ.5000 కోట్లు
- వైఎస్సార్ జలకళకు రూ.50 కోట్లు
- నీటి పారుదల రంగానికి రూ.11450.94 కోట్ల ప్రతిపాదన