టీడీపీ సభ్యుల ప్రవర్తన అలా ఉందంటూ ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ ఫైర్

ABN , First Publish Date - 2022-09-19T16:28:36+05:30 IST

బీఏసీ(BAC)లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సభ జరుగుతుందని ఏపీ అసెంబ్లీ(AP Assembly) చీఫ్ విప్ ప్రసాద్ రాజు

టీడీపీ సభ్యుల ప్రవర్తన అలా ఉందంటూ ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ ఫైర్

Amaravathi : బీఏసీ(BAC)లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సభ జరుగుతుందని ఏపీ అసెంబ్లీ(AP Assembly) చీఫ్ విప్ ప్రసాద్ రాజు(Chief whip Prasad Raju) పేర్కొన్నారు. ఎప్పుడు సస్పెండ్ చేసుకుని వెళ్ళిపోదామా అన్నట్లు టీడీపీ సభ్యుల(TDP members) ప్రవర్తన ఉందని ప్రసాదరాజు ఫైర్ అయ్యారు. సభను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని.. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చకు టీడీపీ నాయకులు(TDP Leaders) భయపడుతున్నారన్నారు. సబ్జెక్ట్ లేకుండా సభకు వస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) బలవంతంగా ఎమ్మెల్యేలను సభకు పంపుతున్నట్లుందని ప్రసాద్ రాజు పేర్కొన్నారు. ఈ రోజున సభకు వచ్చి ప్రతిపక్షం చర్చలో పాల్గొనాలని కోరుతున్నానన్నారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం(AP Government)పై బయట దుష్ప్రచారం మానుకోవాలని ప్రసాద్ రాజు సూచించారు.

Read more