భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఎన్‌వోసీ: కేశినేని

ABN , First Publish Date - 2022-03-23T08:47:47+05:30 IST

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎన్‌వోసీ జారీ చేయాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. మంగళవారం లోక్‌సభలో పౌర...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఎన్‌వోసీ: కేశినేని


న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎన్‌వోసీ జారీ చేయాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. మంగళవారం లోక్‌సభలో పౌర విమానయాన శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు 2700 ఎకరాల భూమిని సేకరించారని, ఆ భూమిని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి అప్పగించి ఎన్‌వోసీలు తీసుకుందని తెలిపారు. ఆ తర్వాత నిర్మాణానికి జీఎంఆర్‌తో ఒప్పందం కుదిరిందని, కానీ ఎన్‌వోసీల కాలపరిమితిని ముగిసి పోయిన నేపథ్యంలో నిర్మాణం ఇంకా ప్రారంభంకాలేదని తెలిపారు. అలాగే, విజయవాడ ఎయిర్‌పోర్టు కోసం గత ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ కింద సేకరించిన భూమికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం యాన్యుటీ చెల్లించడం లేదని, దాంతో రైతులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో చొరవ తీసుకొని కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

Read more