మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్‌ కలకలం!

ABN , First Publish Date - 2022-08-25T08:52:03+05:30 IST

మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్‌ కలకలం!

మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్‌ కలకలం!

పాడేరు, ముంచంగిపుట్టు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్‌ కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు పీహెచ్‌సీ పరిధిలోని దొరగూడ గ్రామంలో ఓ చిన్నారి చేతిపై కురుపు రావడంతో కుటుంబ సభ్యులు బుధవారం వైద్యులకు చూపించారు. అది ఆంత్రాక్స్‌గా వైద్యులు అనుమానిస్తున్నారు. గ్రామంలో మరో పది మంది వరకు ఆంత్రాక్స్‌ లక్షణాలతో బాధపడుతున్నట్టు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆ గ్రామానికి గురువారం ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించేందుకు చర్యలు చేపట్టారు. ఈ బృందం దొరగూడలో పర్యటించి గిరిజనులను పరీక్షించనుంది. 

Read more