Annavaram: సత్యదేవుడికి కాసులు కురిపించిన కార్తీకమాసం

ABN , First Publish Date - 2022-11-24T20:47:56+05:30 IST

కాకినాడ జిల్లా అన్నవరం (Annavaram)లో ఉన్న సత్యదేవుడి ఆలయానికి ఈ ఏడాది కార్తీకమాసంలో రికార్డుస్థాయి ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తి తెలిపారు.

Annavaram: సత్యదేవుడికి కాసులు కురిపించిన కార్తీకమాసం

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం (Annavaram)లో ఉన్న సత్యదేవుడి ఆలయానికి ఈ ఏడాది కార్తీకమాసంలో రికార్డుస్థాయి ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తి తెలిపారు. అక్టోబరు 26 నుంచి నవంబరు 23 వరకు ఉన్న కార్తీకమాసంలో అన్ని విభాగాల ద్వారా రూ.19,94,57,109 ఆదాయం సమకూరిందన్నారు. గతేడాది కార్తీకమాసంలో రూ.18.95 కోట్లు లభించగా, సుమారు కోటి రూపాయలు పెరిగింది. ఈ ఏడాది కార్తీకమాసంలో వ్రతాల ద్వారా రూ. 7.75 కోట్లు, ప్రసాదం ప్యాకెట్ల విక్రయాల ద్వారా రూ.4.68 కోట్లు, భక్తుల హుండీలలో సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.11 కోట్లు సమకూరగా సత్రం గదుల అద్దెల ద్వారా గతేడాదితో పోలిస్తే రూ.9లక్షల ఆదాయం తగ్గి కేవలం రూ.73.39లక్షలు మాత్రమే సమకూరింది. కార్తీకంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా సిబ్బంది, వ్రతపురోహితులు, ప్రసాదం ప్యాకర్లు తదితరుల కృషిని ఈవో సత్యనారాయణమూర్తి, చైర్మన్‌ ఐ.వి. రోహిత్‌లు అభినందించారు.

Updated Date - 2022-11-24T20:47:57+05:30 IST