APలో ముదురుతున్న Fake Tweet War
ABN , First Publish Date - 2022-06-08T21:45:42+05:30 IST
ఏపీ (AP)లో ఫేక్ ట్వీట్ వార్ (Fake Tweet War) ముదురుతోంది.

Amaravathi: ఏపీ (AP)లో ఫేక్ ట్వీట్ వార్ (Fake Tweet War) ముదురుతోంది. ఫేక్ ట్వీట్లు.. సోషల్ మీడియాలో ప్రచారంపై టీడీపీ (TDP) నేతలు సీరియస్ అయ్యారు. మంత్రి అంబటి - దేవినేని ఫేక్ ట్వీట్, గౌతు శిరీష ఎపిసోడ్ తర్వాత ఫేక్ ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ టార్గెట్‌గా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఫేక్ న్యూస్‌లపై బుక్లెట్ వేసే యోచనలో ఉన్నారు. ‘జగన్ మోసపు రెడ్డి.. (జే-గ్యాంగ్-ఫేక్ ఫెలోస్) పేరు’తో బుక్ లెట్ వేయాలని చర్చ జరుగుతోంది. ఫేక్ ప్రచారంపై సీఐడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు పింక్ డైమండ్, బాబాయ్ హత్య, కోడి కత్తి వంటి అంశాలను బుక్‌లెట్‌లో ప్రచురించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. బుక్ లెట్లను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి పంపిణీ చేయనున్నారు.