అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో ఉన్నతాధికారుల భేటీ

ABN , First Publish Date - 2022-02-16T21:26:03+05:30 IST

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో ఉన్నతాధికారుల భేటీ

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకంపై (EHS) చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కొత్త వైద్య విధానాలను ఉద్యోగుల ఆరోగ్య పథకంలోకి చేర్చడం, మెడికల్ రీయంబర్స్‌మెంట్‌ పథకాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించడం, ఆరోగ్యశ్రీ పథకం బిల్లుల తరహాలో ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) బిల్లులను సకాలంలో చెల్లించడం.. అలాగే మేనేజ్‌మెంట్ కమిటీల్లో పెన్షనర్ల ప్రతినిధులను సభ్యులుగా చేర్చడంపై ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. 

Read more