వైసీపీ నుంచి అనంతబాబు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-05-26T09:37:17+05:30 IST

మాజీ డ్రైవర్‌ హత్యకేసులో జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది.

వైసీపీ నుంచి అనంతబాబు సస్పెన్షన్‌

అమరావతి, కాకినాడ, మే 25 (ఆంధ్రజ్యోతి): మాజీ డ్రైవర్‌ హత్యకేసులో జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీ కేం ద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తానే చంపానని పోలీసుల ఎదుట అనంతబాబు అంగీకరించిన నేపథ్యంలో ఆయనపై చర్య తీసుకున్నట్టు వివరించింది. 


అన్యాయంగా ఇరికించారు: ఎమ్మెల్యే ధనలక్ష్మి 

రంపచోడవరం: కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో కేవలం రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీ అనంతబాబును ఇరికించారని,  దీనిని మీడియాలో రాద్ధాంతం చేసి లేనిపోని రాతలు రాయిస్తూ టీడీపీ ఆనందిస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆరోపించారు. బుధవారం ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో మీడియాతో మాట్లాడారు. తూర్పు మన్యంలో వైసీపీని పటిష్ఠపరిచి ఎదురులేని శక్తిగా ఎదుగుతున్న అనంతబాబును చూసి ఓర్వలేకనే కుట్ర పన్నారన్నారు. 

Updated Date - 2022-05-26T09:37:17+05:30 IST