నేటితో ముగియనున్న అనంతబాబు రిమాండ్ గడువు
ABN , First Publish Date - 2022-06-20T14:58:37+05:30 IST
ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో గత నెల 23న ఆయన అరెస్ట్ అయ్యారు.
అమరావతి : ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో గత నెల 23న ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబు ఉన్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో అనంతబాబును పోలీసులు హాజరుపరచనున్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ను అధికారులు కొట్టివేశారు.