Anantapuram: అదుపు తప్పి ఆటో బోల్తా..ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-10-07T15:44:16+05:30 IST
గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జక్కలచెరువు దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో
అనంతపురం: గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జక్కలచెరువు దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.