గుంతకల్లులో 14 మంది మట్కాబీటర్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-09-17T12:19:08+05:30 IST

గుంతకల్లులోని 14 మంది మట్కా బీటర్లను పోలీసలు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షలు, మూడు సెల్‌ఫోన్లు, చీటీలను స్వాధీనం

గుంతకల్లులో 14 మంది మట్కాబీటర్ల అరెస్టు

అనంతపురం: గుంతకల్లులోని 14 మంది మట్కా బీటర్లను  పోలీసలు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షలు, మూడు సెల్‌ఫోన్లు, చీటీలను స్వాధీనం చేసుకున్నారు. స్ధానిక వన టౌనపోలీసు స్టేషనలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐలు రామసుబ్బయ్య, చిన్న గోవిందు అరెస్టు వివరాలను వెల్లడించారు. హనుమేష్‌ నగర్‌, సత్యనారాయణ పేట, తిలక్‌నగర్‌, శాంతి నగర్‌, సోఫియా సీ్ట్రట్‌, ఈద్గా మసీదు రోడ్డులో గత కొన్ని రోజులుగా మట్కా రాస్తున్నారన్నారు. వచ్చిన సమాచారం మేరకు రెండు బృందాలుగా ఏర్పాడి దాడులు నిర్వహించామన్నారు. వనటౌన పరిధిలో హనుమాన సర్కిల్‌ ఎనిమిది మందిని, టూటౌన పరిధిలోని అంబమ్మ దేవాలయం వద్ద ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 1,50,900, మూడు సెల్‌ఫోన్లు, చీటీలు, పెన్నులు స్వాదీనం చేసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more