సీఎం జగన్ ఓ శాడిస్ట్: Ayyannapatrudu

ABN , First Publish Date - 2022-06-15T23:47:44+05:30 IST

సీఎం జగన్ (Cm Jagan) ఓ శాడిస్ట్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) విమర్శించారు. చోడవరంలో...

సీఎం జగన్ ఓ శాడిస్ట్: Ayyannapatrudu

అనకాపల్లి (Anakapally): సీఎం జగన్ (Cm Jagan) ఓ శాడిస్ట్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) విమర్శించారు. చోడవరంలో ‘ఎన్టీఆర్ స్ఫూర్తి.. చంద్రన్న భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‎పై అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. చంద్రబాబు (Chandrababu) పేరు చెబితే జగన్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. దొంగోడికి పోలీసులు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తున్నారని చెప్పారు. తమ కార్యక్రమాలకు గ్రామాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. Updated Date - 2022-06-15T23:47:44+05:30 IST