ఉద్యోగి దగ్గర రూ.వెయ్యి ఉండొచ్చు!

ABN , First Publish Date - 2022-12-31T05:39:13+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్న సమయంలో వారివద్ద వ్యక్తిగత నగదు రూ.1000 వరకు ఉండొచ్చని సర్కారు స్పష్టం చేసింది.

ఉద్యోగి దగ్గర రూ.వెయ్యి ఉండొచ్చు!

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్న సమయంలో వారివద్ద వ్యక్తిగత నగదు రూ.1000 వరకు ఉండొచ్చని సర్కారు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రూ.500లుగా ఉన్న పరిమితిని రూ.1000కి పెంచినట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా నగదు లావాదేవీల విభాగాల్లో పనిచేసేవారు విధుల్లో ఉండగా, ఏసీబీ తనిఖీల సమయంలో ఉద్యోగి వద్ద వ్యక్తిగత నగదు రూ.500 ఉండేందుకు మాత్రమే ఇప్పటి వరకు అనుమతి ఉండగా దాన్ని పెంచారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ రెవె న్యూ సర్వీసెస్‌ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్వాగతించారు.

Updated Date - 2022-12-31T05:39:14+05:30 IST