కమీషన్ల కోసమే అమూల్‌కు డెయిరీల తాకట్టు: టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు

ABN , First Publish Date - 2022-12-15T03:50:25+05:30 IST

: ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ రంగ డెయిరీలను, వాటి ఆస్తులను కాపాడి, రైతులకు న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి అమూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ బీఎస్‌ రాజసింహులు(దొరబాబు) ధ్వజమెత్తారు.

కమీషన్ల కోసమే అమూల్‌కు   డెయిరీల తాకట్టు: టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ రంగ డెయిరీలను, వాటి ఆస్తులను కాపాడి, రైతులకు న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి అమూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ బీఎస్‌ రాజసింహులు(దొరబాబు) ధ్వజమెత్తారు. బుధవారం తన నివాసం నుంచి జూమ్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ‘‘కమీషన్లకు కక్కుర్తిపడే రాష్ట్రంలోని సహకార డెయిరీలను జగన్‌రెడ్డి అమూల్‌కు ధారాదత్తం చేస్తున్నారు. లీటర్‌కు రూ.2-3 తక్కువ ఇస్తున్న అమూల్‌కు డెయిరీలను తాకట్టు పెడుతున్నారు. తనపై ఉన్న అవినీతి కేసుల్ని మాఫీ చేయించుకోవటానికే రాష్ట్ర పాడి పరిశ్రమలను గుజరాత్‌ వాళ్లకి ధారాదత్తం చేస్తున్నారు. సహకార డెయిరీలను అమూల్‌కు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటో జగన్‌ చెప్పాలి’’ అని దొరబాబు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-15T03:50:26+05:30 IST