హిందూ మతాన్ని స్వీకరించిన అమెరికన్లు

ABN , First Publish Date - 2022-10-05T03:20:19+05:30 IST

అమెరికాకు చెందిన ఇద్దరు క్రైస్తవులు వేదోక్తంగా హిందూ మతాన్ని స్వీకరించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలోని

హిందూ మతాన్ని స్వీకరించిన అమెరికన్లు

ఏర్పేడు: అమెరికాకు చెందిన ఇద్దరు క్రైస్తవులు వేదోక్తంగా హిందూ మతాన్ని స్వీకరించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం ఇందుకు వైదికైంది. అమెరికాకు చెందిన డేవిడ్‌ సన్‌, అలెక్స్‌ వేదాల ఆవిర్భావంపై పరిశోధన చేశారు. ఈ క్రమంలో హిందూధర్మం అత్యంత సనాతనమైనదిగా తెలియడంతో ఆకర్షితులయ్యారు. హైదరాబాదుకు చెందిన రఘు అనే వ్యక్తి ద్వారా సంప్రదాయబద్దంగా హిందూమతం స్వీకరించాలని నిశ్చయించుకున్నారు. పరమశివుడు కొలువైన అతి పురాతన ఆలయమైన పరశురామేశ్వరుడి గుడికి  మంగళవారం వచ్చారు. ముందుగా ఐదుగురు వేద పండితులు  పవన్‌కుమార్‌ శర్మ, ప్రశాంత్‌ శర్మ, యోగేంద్ర పవన్‌కుమార్‌ శర్మ, గణేష్‌ శర్మ, విజయ్‌కుమార్‌ శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య వారికి శివ గోత్రాన్ని సార్థకం చేయడంతో హిందూమతాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయంలో మూలమూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.పరశురామేశ్వర హోమంలో పాల్గొని అగ్నిహోత్రం ద్వారా దేవతలకు హవిస్సులు సమర్పించారు. ఆలయ చైర్మన్‌ నరసింహ యాదవ్‌,ఈవో రామచంద్రారెడ్డి, సర్పంచ్‌ సుబ్రమణ్యం యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more