కోనసీమ జిల్లాకు Ambedkar పేరు ఖరారు
ABN , First Publish Date - 2022-06-24T20:20:55+05:30 IST
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్లో ఆమోదం ముద్రపడింది.
అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్రవేసింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై స్థానికంగా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు జిల్లా పేరును మార్చుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమలాపురం(Amalapuram)లో భారీగా పోలీసులు మోహరించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.