అంబేడ్కర్ ఆశయాలను అర్థం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-12-07T03:00:51+05:30 IST
భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ అంబేడ్కర్ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు కాబట్టే సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలను చట్టసభల వైపు నడిపించాలని...
యువతకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ అంబేడ్కర్ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు కాబట్టే సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలను చట్టసభల వైపు నడిపించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయాలని సంకల్పించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని ఆయన తప్పించారని తెలిపారు. వర్తమాన సమాజం మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని సూచించారు. స్త్రీ విద్య గురించి, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికి హక్కులు కల్పించడం గురించి తన అభిప్రాయాలను చర్చల్లో ఎంత బలంగా వినిపించారో నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను తాను అవగాహన చేసుకున్నాను కనుకే, జనసేన పార్టీ సిద్ధాంతాలపై ఆ ప్రభావం ఉందని సృష్టంగా చెప్పగలుగుతున్నానని పవన్ పేర్కొన్నారు.