-
-
Home » Andhra Pradesh » ambati rambabu cm jagan ycp chsh-MRGS-AndhraPradesh
-
cm jagan: జగన్ సమీక్ష అనంతరం అంబటి చెప్పిన వివరాలు ఇవే
ABN , First Publish Date - 2022-07-19T00:37:44+05:30 IST
మరింత మెరుగ్గా గడప గడపకు కార్యక్రమం చేసేందుకు సీఎం ఆదేశాలిచ్చారని జలవనరులశాఖ మంత్రి ambati rambabu వెల్లడించారు.

అమరావతి: మరింత మెరుగ్గా గడప గడపకు కార్యక్రమం చేసేందుకు సీఎం ఆదేశాలిచ్చారని జలవనరులశాఖ మంత్రి ambati rambabu వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు నిధులు ఇస్తూ సీఎం ఆదేశాలిచ్చారని తెలిపారు. అలాగే ప్రతి సచివాలయానికి మరో 20 లక్షలు చొప్పున కేటాయించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉన్న అభివృద్ది పథకాలకు, సమస్యల పరిష్కారానికి కేటాయించాలని కూడా సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 85 శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారని తెలిపారు.