-
-
Home » Andhra Pradesh » Amaravati to Arasavalli-NGTS-AndhraPradesh
-
అమరావతి టూ అరసవల్లి
ABN , First Publish Date - 2022-08-17T09:09:33+05:30 IST
రాజధాని అమరావతి రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజులు ‘‘న్యాయస్థానం టు దేవస్థానం’’ పేరిట తిరుపతి వరకు పాదయాత్ర చేసిన వారు..

రాజధాని రైతుల పాదయాత్ర-2
తుళ్లూరు, ఆగస్టు 16: రాజధాని అమరావతి రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజులు ‘‘న్యాయస్థానం టు దేవస్థానం’’ పేరిట తిరుపతి వరకు పాదయాత్ర చేసిన వారు.. సెప్టెంబరులో అమరావతి నుంచి అరసవల్లి వరకు 630 కిలోమీటర్ల మహా పాదయాత్ర చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీనిపై చర్చించేందుకు బుధవారం తుళ్లూరు సాయిబాబా కళ్యాణ మండపంలో దళిత జేఏసీ, మైనార్టీ జేఏసీ, మహిళా జేఏసీ, లీగల్ కమిటీ సభ్యులు, రైతు ధర్నా శిబిరాల నిర్వాహకులు హాజరుకానున్నారు.