ఆ MPEOల కాంట్రాక్ట్ గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2022-06-30T00:34:17+05:30 IST
వ్యవసాయ శాఖలో పని చేసే MPEOల కాంట్రాక్ట్ గడువును ప్రభుత్వం పొడిగించింది. మొత్తం 1,611 మంది మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కాంట్రాక్టు పద్ధతిపై ...

అమరావతి (Amaravathi): వ్యవసాయ శాఖలో పని చేసే MPEOల కాంట్రాక్ట్ గడువును ప్రభుత్వం పొడిగించింది. మొత్తం 1,611 మంది మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. ఈ ఏడాది మార్చితో వీరి కాంట్రాక్టు గడువు ముగిసింది. దాంతో మరో ఏడాది పెంచుతూ ఏపీ ప్రభుత్వం (Ap Government) నిర్ణయం తీసుకుంది. 2023 మార్చి వరకూ పొడిగిస్తూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) జీవో జారీ చేశారు.